- కోడర్లూ.. ప్రత్యామ్నాయం చూసుకోండి
- సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఏఐతో ముప్పు
- జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు
మహా
సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు కోడర్లకు జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక సూచనలు చేశారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో కోడ్ రాసి జీవనోపాధి పొందే వారు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని సూచించారు. అనిష్ మూంకా అనే ఇన్వెస్టర్ ఒక్క లైన్ కూడా కోడింగ్ తెలియకుండానే ఏఐ సాయంతో భగవద్గీత యాప్‌ను తయారు చేశారు. అందుకోసం ఏఐని ఎలా వాడిందీ తన ఎక్స్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. దాన్ని కోట్ చేస్తూ శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా స్పందించారు. భవిష్యత్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందన్న అంశంపై జెమిని ఏఐ ప్రోతో ఆయన సాగించిన సంభాషణను కూడా తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో పోస్ట్ లేబర్ ఎకానమీ రావచ్చని అభిప్రాయపడ్డారు. అందులో మనుషులు జీవితం, కుటుంబం, ప్రకృతి, కళలు, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసం వంటి అంశాలపై మనుషులు దృష్టి పెట్టవచ్చన్న ఆశావహ దృక్పథం వ్యక్తం చేశారు. ఓ వైపు ఆంత్రోపిక్ ఏఐ సంచలనాల నేపథ్యంలో జోహో ఫౌండర్ చేసిన ట్వీట్ మారనున్న ప్రపంచానికి అద్దం పడుతున్నాయి.








