Mahaa Daily Exclusive

  అభివృద్ధికి బాటలు వేయండి.. హస్తం గుర్తుకే ఓటేయండి: ఇబ్రహీంపట్నం ప్రచారంలో మంత్రి సీతక్క పిలుపు

Share

  • కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి అభివృద్ధికి బాటలు వేయండి
  • ఇబ్రహీంపట్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి
  • ఎమ్మెల్యే రంగన్న కృషితో ఇబ్రహీంపట్నంలో ఆసుపత్రి నిర్మాణం
  • హస్తం మన నేస్తం హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరిన సీతక్క
  • మహిళా సంఘాల అభివృద్ధికి నాదే బాధ్యత సీతక్క
  • గత ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రి సీతక్క
  • మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే రంగారెడ్డి…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులకు నియామకాలకు వెనుకబడి ఉన్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసిండు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ముఖ్యమంత్రి పై ప్రభుత్వం పై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అబద్దాలను నమ్ముకుని, అస్త్రాలుగా వాడుకొని పూట గడుపుతున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి పై చిత్తశుద్ధితో ఉందని, అప్పుల రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను మంత్రి సీతక్క కోరారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి….
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, శాస్త్ర గార్డెన్లో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయని, గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని, ప్రజలకు మభ్యపెట్టారే తప్ప వాళ్ల సమస్యల పరిష్కారానికి ఏనాడు ఆలోచన చేయలేదని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే నాయకత్వం మన రాష్ట్రంలో కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ప్రజలకు భరోసాన్ని కల్పించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారని, ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మన వార్డు కాలనీలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, వార్డు అభివృద్ధికి మరిన్ని నిధులు రావడం జరుగుతుందని ఆమె ప్రజలకు తెలియజేశారు, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

కూని ఆపరేషన్ తో ఆడబిడ్డల ప్రాణాలను బలితీసుకున్నారు…
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఆరుగురు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆ ఘటనను గుర్తు చేసుకుంటే చాలా బాధాకరంగా ఉందని, ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దు అనే ఆలోచనతో, పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం ఉండేలా, మున్సిపాలిటీ కేంద్రంలో అత్యాధునిక హంగులతో కార్పోరేట్ హాస్పిటల్ దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ ను, ప్రజాపాలనలో ఎమ్మెల్యే రంగన్న కృషితో నేడు ఇబ్రహీంపట్నంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కాబోతుందని మంత్రి అన్నారు.
ఇప్పటికే కాలనీలలో అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లను నిర్మించుకోవడం జరిగిందని, మన పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గా ఉంటే వార్డులో సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. వేరొక పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గా ఉంటే ఆ యొక్క సమస్య అంత తొందరగా సమస్య పరిష్కారం కాదు అని ప్రజలకు తెలియజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను మీయొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట…
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకు వడ్డి లేని రుణాలను ఇచ్చి వడ్డీలు ప్రభుత్వం బ్యాంకులకు పడుతుందని గుర్తు చేశారు. మహిళలకు చక్కటి చీరలను అందజేయడం జరిగిందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్లతో నెరవేర్చడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్లకు 5లక్షలతో పాటు మహిళా సంఘాల ద్వారా ఇంటి నిర్మాణం కోసం ముందుగానే 2లక్షల వరకు రుణాలను అందించడం జరిగిందని తెలిపారు. కెసిఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఉన్న రేషన్ కార్డును తీసేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడంతోపాటు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం కూడా అందించడం జరిగిందని ఆమె తెలిపారు.

మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే రంగారెడ్డి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని మహిళల పేరు మీదనే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈనెల 11న జరిగే పోలింగ్లో మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జులు, ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.