Mahaa Daily Exclusive

  కరీంనగర్‌లో ‘ఇండియా Vs పాకిస్థాన్’ కబడ్డీ మ్యాచ్.. రూ.100 కోట్ల డీల్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Share

  • కరీంనగర్ లో వందకోట్ల కబడ్డీ ఆట
  • ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్, మహా : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌లో కబడ్డీ ఆట మొదలైందని చెప్పారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో ఎంఐఎం/కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఉండబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లోని మీడియా, సోషల్ మీడియాసహా యువకులంతా కుల, మతాలకు అతీతంగా ఒక్కటై కాంగ్రెస్, ఎంఐఎం చేస్తున్న కుట్రలను వివరించాలని పిలుపునిచ్చారు. ‘కరీంనగర్‌కు రక్షణ కవచంగా నేనుంటా. కరీంనగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలకు తగిన బుద్ధి చెప్పండి’ అని బండి కోరారు.

Latest