- శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం!
- నా ఓటు చోడికి గురైంది మహిళా ఓటర్
- నా ఓటు నాకు కావాలంటూ మహిళ ఆందోళన
- జిల్లా ఎన్నికల అధికారికి పెరిగారు చేస్తాం: ఓటరు పారిజాత
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తన ఓటు చోరీకి గురైందని ఆందోళనకు దిగిన శేరిగూడ గ్రామానికి చెందిన మహిళ ఓటరు పారిజాత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలోని 15వ వార్డులో క్యామ పారిజాత అనే మహిళ ఓటును వేరేవాళ్ళు వేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.. తన ఓటు ఎవ్వరు వేసారంటూ ఏజెంట్లను నిలదీయగా, అప్పటికే నీయొక్క ఓటు వేసారని చెప్పడంతో ఫోటోలు పారిజాత కంగు తినడం జరిగింది. దీంతో మహిళ అక్కడ ఉన్న అధికారులను నిలదీయడం జరిగింది. మా గ్రామస్తులే ఏజెంట్లుగా ఉంటే, వేరే వ్యక్తులు ఎలా ఓటు వేస్తారని మీడియాతో పారిజాత తెలిపారు. అక్రమంగా తన ఓటు వేరే వాళ్ళు వేయడం తగదని నా ఓటు నాకు కల్పించాలని, అక్రమానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.
జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు….
జిల్లా ఎన్నికల అధికారిని కలిసి దొంగ ఓట్లకు సహకరించిన, పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని సదర్ మహిళా తెలపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.








