Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి రైతు ద్రోహి.. ఫోన్ ట్యాపింగ్‌పై సమాధానం చెప్పాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్

Share

  • ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం చెప్పాలి
  • మంత్రి పొంగులేటి కామెంట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎంకు రాజకీయాలే తప్ప రైతులపై ప్రేమ లేదన్నారు. యూరియా పక్కదారి పడుతున్నా పట్టిచుకోవడం లేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారన్నారు. కేంద్రాన్ని విమర్శించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా తానేమి చేస్తున్నాననే విషయాన్ని రేవంత్ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. టీవీల ముందు తప్ప రైతుల పట్ల బాధ్యత లేదా అని, యూరియా మీద కనీసం సమీక్ష చేయరా అని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలో రైతులు గోసపడారని మంత్రి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రేవంత్‌ భయపడుతున్నారా? కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా? అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Latest