- ఓటు హక్కు వినియోగించుకున్న యువత…
- జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్…
- జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు…
- నేను సైతం అంటూ… ఓటేసిన వృద్ధులు….
- ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. ఇద్దరి అరెస్ట్…
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు కల్పించిన ఓటు హక్కును ప్రజలు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో ముసలి ముతక, యువతి యువకులు పాల్గొని తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకోవడం జరిగింది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా, తప్పిదాలకు తవ్వివకుండా, సజావుగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలు, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గత నెల 27వ తారీకు నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ ఈనెల 11వ తారీకు పోలింగ్తో ముగిసింది. అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎన్నికలలో హోరాహోరీగా ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికలలో ఎలాగైనా పై చేయి సాధించాలని పట్టుదలతో ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఓటర్లను ఆకర్షిస్తూ ఓటు వేయించుకునేలా పోటాపోటీగా ప్రచారం చేశారు.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు…
రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు చేవెళ్ల, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్లు, శంకర్పల్లి మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు దాదాపు జిల్లాలో 80 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి సి నారాయణరెడ్డి వెల్లడించారు. జిల్లాలో అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉదృతలు జరిగిన ప్రాంతాలలో పోలీసులు ఆందోళన కారణాలు చదరగొట్టి, ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్…
మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్బంగా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, చేవెళ్ళ మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయు వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపులో ఎక్కడ కూడా పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతతో విధులు నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నేను సైతం అంటూ… ఓటేసిన వృద్ధులు….
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పదవ వార్డ్ ఖానాపూర్ గ్రామంలో వయోవృద్ధులు యువకులు మహిళలు తమ ఓటును వినియోగించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను సైతం అంటూ.. వీల్ చైరుకు పరిమితమైన వ్యక్తి, వృద్ధులు ఈ ఎన్నికలలో పాల్గొని తన ఓటును వినియోగించుకోవడం జరిగింది.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. ఇద్దరి అరెస్ట్…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ స్టేషన్కు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో కొంతమంది ఓటర్లను ప్రలోభ పరుస్తున్నారని గమనించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందనే గమనించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.








