Mahaa Daily Exclusive

  కేబుల్ ఛానల్స్ అక్రిడిటేషన్ల సమస్య పరిష్కరిస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ

Share

హైదరాబాద్, మహా
కేబుల్ ఛానల్స్ అక్రిడిటేషన్ సమస్య పరిష్కరిస్తామని, జీవోను సవరించి పాతపద్దతిలోనే ఎవరూ ఇబ్బందిపడకుండా న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు. గురువారం కేబుల్ ఛానళ్ళ అక్రిడిటేషన్ సమస్య పరిష్కరించాలని, గతంలో ఉన్న పాత జీవో ప్రకారమే అక్రిడిటేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని యూనియన్ నేతలు మారుతీసాగర్, రమణ,తో పాటు వివిధ ఛానళ్ళ యాజమాన్యాలు విజ్ఞప్తి చేశారు. గత జీవోలో రాష్ట్ర స్థాయిలో 12, ప్రతీ జిల్లాలో నాలుగు అక్రిడిటేషన్లు ఇచ్చారని ఇపుడు కూడా ఛానల్ ప్రసారమయ్యే జిల్లాల్లో అదే పద్దతిన ఇవ్వాలని, ఎంతో వ్యయంతో ఉపాధి కల్పిస్తూ నడుపుతున్న ఛానళ్ళకు సహకరించాలని కోరారు. ఎవరినీ ఇబ్బందిపెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని, కేబుల్ ఛానళ్ళకు పాతపద్దతిలోనే అక్రిడిటేషన్లు మంజూరుచేస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీనిచ్చారు. దీనిపై తాను అధికారులకు ఆదేశాలిస్తానని, ఎవరూ అధైర్యపడవద్దన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.మంత్రిని కలిసిన వారిలో ఎఎన్ఎన్ ఛానల్ నుండి మందడి అరవింద్ రెడ్డి, వీ5 ఛానల్ వెంకట్, కోవా టీవీ దేవేందర్, ఎబి న్యూస్ బ్రహ్మం, న్యూస్ 9 చలపతి తో పాటు వివిధ ఛానళ్ళ ప్రతినిధులు ఉన్నారు.

Latest