జిల్లాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఆటో డ్రైవర్లు ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవల అధిక/అన్యాయ ఛార్జీలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు ఆటో డ్రైవర్ల బంధువులు కూడా మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు.
యాప్ క్యాబ్ సంస్థలు తక్కువ ధరల పేరుతో ప్రయాణికులను ఆకర్షించి, తరువాత సర్జ్ ప్రైసింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. దీని వల్ల సంప్రదాయ ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని యాప్ క్యాబ్ ఛార్జీలపై నియంత్రణలు విధించాలని, అన్ని వాహనాలకు సమాన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు మరియు డ్రైవర్ల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 6








