- బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..!
- జిల్లాలో నేడే కౌంటింగ్.. గెలుపు ఎవరిదో..
- స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచిన బ్యాలెట్ బాక్స్ లు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల పహారా
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించరాదు…
- ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నేడు శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు, ఓట్ల లెక్కింపు కోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీల్లో పాల్గొన్న అభ్యర్థుల భవితవ్యం, స్ట్రాంగ్ రూములలో భద్రపరచిన బ్యాలెట్ బాక్స్ లలో నిశ్చితమై ఉన్నది. ఈనెల 11న జరిగిన పోలింగ్లో ఓటర్లు తమ వార్డులలో అభివృద్ధి చేయగలిగే నాయకునికి ఓటు వేయడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసి, ప్రజల మన్నలను ఎవరు పొందారు అనే నాయకుల భవితవ్యం నేడు తేలనుంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గెలుపోవటములను సహజంగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో పాల్గొన్న అభ్యర్థులు తమ యొక్క గెలుపు ఓటములను తెలుసుకునే రోజు నేడు.
జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలు….
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆర్వోలది తుది తీర్పుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అనుసరించి ఓట్ల లెక్కింపులో పాల్గొనాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన కోట్ల లెక్కింపు కేంద్రాలు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్, శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమనగల్ మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మ్యాక్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చిలుకూరులో నిర్వహించనున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీకి సంబంధించి పరాహ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఓట్ల లెక్కింపు జరగనుంది. షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి మినీ స్టేడియం ఓల్డ్ ఎన్హెచ్ 47 హైదరాబాద్ రోడ్డులో కౌంటింగ్ నిర్వహించనున్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఆడిటోరియం భవనంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పై తెలిపిన ఓటింగ్ కేంద్రాలలోని స్ట్రాంగ్ రూములలో పోలీస్ పహార మధ్య బ్యాలెట్ బాక్స్ లు భద్రపరచడం జరిగింది. అధికారులు, అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లగించరాదని ఉల్లంఘించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలియడం జరిగింది.








