Mahaa Daily Exclusive

  బీజేపీ శవ రాజకీయం చేస్తోంది: మక్తల్ ఆత్మహత్య ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం

Share

  • బీజేపీ శవ రాజకీయం చేస్తుంది
  • మక్తల్‌ లో మహాదేవప్ప ఆత్మహత్యపై మంత్రి వాకిటి శ్రీహరి
  • నా సంబంధం ఉందని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్న మంత్రి

హైదరాబాద్, మహా:మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్ లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడాన్ని బీజేపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రస్తాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతల దుష్పచారంపై మీడియాతో మాట్లాడిన మంత్రి ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుకోకుండా కమలంపార్టీ నేతలు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన మనం తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. దేవప్ప ఆత్యహత్యపై అవగాహన లేకుండా మాట్లాడిన బీజేపీ నేతలను భవిష్యత్‌ క్షోభకు గురిచేస్తోందన్నారు. దేవప్పు మరణంపై పార్లమెంటు వరకు మాట్లాడటం సమంజసం కాదన్నారు. బీజేపీ నేతలు మహాదేవప్పకు భరోసా ఇవ్వకపోవడంవల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తోందన్నారు. దేవప్ప ఆత్మహత్యపై అనేక కారణాలు చెబుతున్నారని, దేవప్ప ఆత్మహత్యపై ఇప్పటికే విచారణ మొదలైందన్నారు. 32 ఏళ్ల నా రాజకీయం జీవితంలో ఒక్కరిని కూడా బెదిరించిన దాఖలు లేవని మంత్రి తెలిపారు. ఆత్మహత్యకు నాకు సంబంధం ఉందని తెలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడటం కాకుండా బాధ్యతతో మాట్లాడాలని మంత్రి బీజేపీ నేతలకు హితవు పలికారు.

Latest