రైతుసంఘాల ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కేంద్రం తీరుపై ఫైర్
హైదరాబాద్, మహా
ఇండియా–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వేదికగా కార్మిక, రైతు సంఘాలు గురువారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై తన సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసనలో కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Post Views: 5








