Mahaa Daily Exclusive

  మహేశ్వరంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు…

Share

  • మహేశ్వరంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు…
  • శ్రీశ్రీశ్రీ శివగంగ రాజరాజేశ్వరిగా కొలువుదీరిన శివయ్య…
  • శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శివాలయం
  • విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న ఆలయం
  • వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయం
  • నేటి బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తుల రాక

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా (మహేశ్వరం): శ్రీశ్రీశ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నేడు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని, మహేశ్వరం నియోజకవర్గం మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ శివగంగ రాజరాజేశ్వరి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కేంద్రాలు, క్యూలైన్లు మరియు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం….

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత చోటుచేసుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ యొక్క ఆలయంలో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది ఆలయం చుట్టూరా కొలను ఉంటుంది. కొలను మధ్యలో గుడి, గుడి కింద భాగాన నీటిలో గంగాదేవితో కలిసి శివలింగం ఉంటుందని, అందుకని శ్రీశ్రీశ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయంగా కొలువుదిరిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిత్యం పూజలు అందుకునే శ్రీశ్రీశ్రీ శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా, రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి నల్లగొండ మహబూబ్నగర్ వికారాబాద్ హైదరాబాద్ జిల్లాల నుంచి రావడం  జరుగుతుంది. శివరాత్రి రోజున భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని, భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతూ ఆలయం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కొలను మధ్యలో గుడి ఉండడంతో గుడి యొక్క ప్రతిబింబం నీటిలో అద్భుతంగా కనిపిస్తూ భక్తులను ఆకర్షిస్తుంది.

Latest