సంగారెడ్డి ప్రతినిధి: మహా:
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డుల ఆధునీకరణను తగిన పరికరాలతో పాఠశాలలోనే చేపట్టారు.ఆధార్ సూపర్వైజర్ రాకేష్ బాల ఆధార్ కార్డులలో ఉన్న విద్యార్థుల కంటి,వేలి ముద్రలు మరియు ఫోటోలను,ఫోన్ నెంబర్ లను నవీకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలలోనే ఆధార్ కార్డులు ఆధునీకరించటం మరియు కొత్త ఆధార్ కార్డులు పొందటానికి చేసే కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ఆధార్ కలిగి ఉండేలా చేయటం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం సంవత్సరానికి మూడు సార్లు ఆధార్ క్యాప్ లు నిర్వహించాలని కోరారు. పాఠశాలలోనే ఆధార్ నవీకరణ పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయలు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత ఆధార్ సూపర్వైజర్ రాకేష్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








