- హరహర మహాదేవ
- శివ నామస్మరణతో..
- మార్మోగిన ఓరుగల్లు
- వేయిస్తంభాల గుడికి వెల్లువెత్తిన భక్తులు
- శివాలయాలు సందర్శించిన మంత్రి కొండా సురేఖ
- వేయిస్తంభాల గుడిలో ఎంపీ కడియం కావ్య ప్రత్యేక పూజలు
- శివాలయాలు సందర్శించిన వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- రుద్రేశ్వరుడికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పూజలు
మహా, వరంగల్ బ్యూరో
మహా శివరాత్రి వేళ.. ఓం నమశ్శివాయ నినాదాలతో శివాలయాలన్నీ మార్మోగాయి. శివనామస్మరణతో ఓరుగల్లు భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం తో పాటు రంగనాథ స్వామి ఆలయం, స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీశ్రీశ్రీ దుర్గేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేకంగా శివలింగాలకు భక్తిశ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పలు ఆలయాలను సందర్శించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య చారిత్రక వేయిస్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రేశ్వరుడికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.








