Mahaa Daily Exclusive

  నా భర్త ఆచూకీ తెలపండి… ఆకుల యాదగిరి భార్య…

Share

  • నా భర్త ఆచూకీ తెలపండి… ఆకుల యాదగిరి భార్య…
  • కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానీ యాదగిరి….
  • పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… ఆర్డీవోకు వాంగ్మూలం
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తన భర్తను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి భార్య, కొడుకు ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీవో అనంతరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొడుకు, మా ఇంటి వద్దకు వచ్చి, నా భర్త ఆకుల యాదగిరినీ క్యాంపుకు తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు….

నేడు ప్రమాణ శ్రీకారానికి 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరు కాకపోవడంతో అతని భార్య, కొడుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నా భర్త లేకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎలా చేస్తారని, ఎన్నికను వాయిదా వేయాలని, ఆర్డీవోతో ఆమె విన్నవించుకున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఆకుల యాదగిరి హాజరు కాకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అతని భార్య, నా భర్త ఆచూకీ తెలపాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఫిర్యాదు అమ్ముకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి వినత పత్రం అందజేసిన 19వ వార్డ్ సభ్యుడు ఆకుల యాదగిరి భార్య… ఆమె యొక్క వాంగ్మూలం ఆర్డిఓ తీసుకోవడం జరిగింది….

ఆందోళన చేపట్టిన ఆమెను, పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది…

Latest