Mahaa Daily Exclusive

  సదాశివపేట నూతనంగా ఎన్నికైన మున్సిపల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

Share

  • సదాశివపేట నూతనంగా ఎన్నికైన మున్సిపల్ సభ్యుల ప్రమాణ స్వీకారం
  • 26 మంది కౌన్సిల్ సభ్యులకు గాను కాంగ్రెస్ 16,  బిజెపి 1, స్వతంత్రులు 1 ప్రమాణస్వీకారం చేశారు.

సంగారెడ్డి ప్రతినిధి: మహా:
సదాశివపేట మున్సిపల్ కు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన కౌన్సిల్ సభ్యులతో సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి ఆర్డీవో గున్నాల రాజేందర్ పర్యవేక్షణలో ప్రమాణస్వీకారం చేయించారు.మొత్తం 26 మంది కౌన్సిల్ సభ్యులకు గాను కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 16 మంది, బిజెపి నుంచి ఒకరు,స్వతంత్రులు ఒకరు ప్రమాణస్వీకారం చేశారు. బి ఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైహాజరయ్యారుహాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి ప్రకటించిన విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ గా రేణుక చిరంజీవి ప్రమాణ స్వీకారం చేశారు. జగ్గారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.చైర్మన్ ,వైస్ చైర్మన్ ,కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest