బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నేత మంచి రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికలలో సందర్భంలో ప్రజా క్షేత్రంలో గెలువక దొడ్డిదారిన చైర్మన్ కావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆకుల యాదగిరి కొడుకుతో హై కోర్టులో కేసు వేయించి, చైర్మన్ ఎన్నిక అడ్డుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఆకుల యాదగిరి బీఆర్ఎస్ పార్టీ బిఫామ్ పై 19వ వార్డు కౌన్సిలర్ గా గెలిచాడని, బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలుపడం జరిగిందని ఆయన అన్నారు. ఆకుల యాదగిరి ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంతో సోమవారం జరిగిన, కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని ఆయనే స్వయంగా తెలపడం జరిగిందని, ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు.
అధికారులపై తీవ్ర ఆరోపణలు.. ఎన్నికల అధికారులు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని, పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి పనిచేస్తున్నారని, తీవ్ర ఆరోపణలు చేసిన ప్రశాంత్ కుమార్ రెడ్డి. హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాకుండా శ్రీధర్ రెడ్డి అనే అడ్వకేట్ ఫోన్ చేసి చైర్మన్ ఎన్నిక ఆపడం ఎంతవరకు సమంజసం అని టిఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పూర్తి మెజార్టీతో ఉన్నా…
పూర్తిస్థాయి మెజార్టీతో ఉన్నా చైర్మన్ ఎన్నిక జరిగిందని, ఉద్దేశం పూర్వకంగా చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడం పై హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుందని, ఈ యొక్క ఎన్నిక వాయిదాకు సహకరించిన అధికారులపై చర్యలు చేపట్టేలా, కంటెంట్ వేయడం జరుగుతుందని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.








