Mahaa Daily Exclusive

  మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక బాధ్యత ఆర్ఓదే.!

Share

  • యాదగిరిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.
  • ముగిసిన హైకోర్టు విచారణ కీలక ఆదేశాలు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ ముగిసింది. కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న చైర్మన్ ఎన్నికపై జరుగుతున్న పరిస్థితుల దృశ్య, యాదగిరి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని, ఆయన స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేలా చూడాలని కలెక్టర్, పోలీసులకు సూచించింది. ఇక మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక బాధ్యత ఆర్ఓదే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఆర్ఓ అనంతరెడ్డి నిర్ణయం ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందని, పట్నం ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు…

Latest