- అన్నీ తానై…!
- అంత్యక్రియలలో పాడే మోసి..
- తల్లి కి కొరివి పెట్టిన కూతుళ్లు.
- నేలకొండపల్లి,
- ఫిబ్రవరి 18 మహా:
మగ వారు లేకపోవటంతో… కవలలు అక్కాచెళ్లలు… అన్నీ తానై తల్లి మృతదేహం పాడే మోసి… తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. వివరాలు, ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురం తండా కు చెందిన తేజావత్ భాగ్యలక్ష్మి (45) అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. ఆమె కు కుమారులు లేకపోవటంతో అంత్యక్రియల పై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మగ వారు లేరనే దిగులు వద్దని తాము ఆడపిల్లలైనా కుమారులు చేసే కార్యాలు తామే చేస్తామని తన ఇద్దరు కూతుళ్లు లక్ష్మి ప్రసన్న. శ్రీలత (కవలలు) ముందుకు వచ్చారు. ‘తల్లి అంత్యక్రియలు అన్నీ తానై నిర్వహించారు. తల్లి మృతదేహం ను పాడే మోశారు. చిన్న కూతురు శ్రీలత తలకొరివి పెట్టారు. సాంప్రదాయం పద్ధతి లో అంత్యక్రియలను నిర్వహించారు. అక్కా-చెళ్లలు పాడే మోసే సమయంలో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
Post Views: 4








