ఆదిలాబాద్ మహా: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో క్రీడా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన హాకీ జట్ల ఎంపిక కార్యక్రమానికి ఆమె 35 వార్డ్ కౌన్సిలర్ మౌనిక శివ గౌడ్ తో కలిసి హాజరయ్యారు. స్టేడియంలో అవసరమైన వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్ఓ శ్రీనివాస్, శాలువాతో సత్కరించి అభినందించారు. స్టేడియంలో వాకర్స్ కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి చేస్తానని నూతన చైర్ పర్సన్ హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కోచ్ రవి తదితరులు పాల్గొన్నారు.








