ఖైరతాబాద్, మహా
జీహెచ్ఎంసి సర్కిళ్ల విభజన అనంతరం కూడా జూబ్లీహిల్స్ సర్కిల్ – 36 కార్యాలయం ఖైరతాబాద్ లోనే కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులపై డివిజన్ల నాయకులతో కలిసి జీహెచ్ఎంసి కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్–36 పరిధిలోని ప్రజలు ఏదైనా సమస్యపై అధికారులను సంప్రదించాలంటే ఖైరతాబాద్‌కు రావాల్సిన పరిస్థితి నెలకొందని, దీనిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రామచందర్ ,నరసింహ, శంకర్, నిశాంత్,శశి రాజ్ , విజయ్ , నవీన్,పాల్గొన్నారు.
Post Views: 2








