- కౌన్సిలర్ పదవి కోసం కులాన్ని మార్చేశారు.?
- బీసీ రిజర్వేషన్ వార్డులో ఓసి కౌన్సిలర్ గా ఎన్నిక
- తీవ్ర ఆరోపణలు చేసిన ప్రత్యర్థి చంద్రకళ
- కలెక్టర్కు ఆర్డిఓకు కమిషనర్ కు ఫిర్యాదు
- కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవి కోసం, కులాన్ని మార్చేశారని చంద్రకళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈనెల 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నకిలీ కుల దృవీకరణ పత్రంతో కౌన్సిలర్ గా పోటీ చేయడం జరిగిందని, సదరు కౌన్సిలర్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు చనమోని చంద్రకళ ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ వార్డులలో గతంలో ఉన్న రిజర్వేషన్లను మార్చడంతో, రిజర్వేషన్లు తారుమారు కావడంతో, ఓసీ వర్గానికి చెందిన సదరు కౌన్సిలర్, బీసీ కుల ధ్రువపత్రాన్ని సమర్పించి, తీసి మహిళా రిజర్వేషన్ కలిగిన వార్డులో ఎన్నికలలో పోటీ చేయడం జరిగిందని, నకిలీ ధ్రువపత్రాలతో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడంపై, కలెక్టరేట్, ఆర్డిఓ కార్యాలయాల్లో, ప్రత్యర్థి చంద్రకళ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. సదరు కౌన్సిలర్ ఎన్నికను రద్దు చేయాలని చిన్నమని చంద్రకళ డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఈ యొక్క ఘటన చర్చానీయాంశమైంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీలో ఇప్పటికే చైర్మన్ ఎన్నికపై పలు అంశాలు తెరమీదకి రావడంతో చైర్మన్ ఎన్నిక ఆలస్యం అవుతున్న తరుణంలో, ఇప్పుడు నకిలీ కుల ధ్రువ పత్రాల అంశం చర్చానీయాంశమైంది.








