Mahaa Daily Exclusive

  నార్సింగులో దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

Share

రంగారెడ్డి జిల్లా మహా:
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దుండగులు ముగ్గురూ పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.

Latest