- ఖైరతాబాద్ లో శివాజీ మహారాజ్ జయంతి
- ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్ ఛార్జి ఎంజీఆర్
ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ రైల్వే గేట్ దగ్గర చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ – మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, మొఘలులకు విరుద్ధంగా స్వరాజ్య పోరాటం చేసిన మహా యోధుడని, సామాజిక న్యాయం, మత సహనంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ గజ్జల ఆనంద్ , మహేందర్ బాబు, చందు, మధుకర్ యాదవ్, కిశోర్, నాగరాజు, శ్రీనివాస్, అశోక్, నిశాంత్ ధనరాజ్, శశి, శౌరి రాజ్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post Views: 7








