Mahaa Daily Exclusive

  21వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక చట్టవిరుద్ధం: కలెక్టర్కు ఫిర్యాదు.?

Share

  • 21వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక చట్టవిరుద్ధం: కలెక్టర్కు ఫిర్యాదు.?
  • చిలకల బుగ్గరాములు పదవిని రద్దు చేయాలి
  • సమీప జనసేన పార్టీ అభ్యర్థి సంతోష్ కుమార్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
చట్ట విరుద్ధంగా కౌన్సిలర్ గా గెలిచిన చిలకల బుగ్గరాములు పదవిని రద్దుచేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన జనసేన పార్టీ నాయకులు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 21వ వార్డు నుండి, బిఆర్ఎస్ పార్టీకి చెందిన చిలకల బుగ్గ రాములు, ఈనెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, సమీప జనసేన పార్టీ అభ్యర్థి పై, కౌన్సిలర్ గా గెలుపొందారు. దీంతో చిలకల బుగ్గరాములు అక్రమంగా గెలిచారని, సంతోష్ కుమార్ ఆరోపించారు.

సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేసిన బుగ్గరాములు…
ఇబ్రహీంపట్నం మండలంలోని, తన స్వగ్రామం పెద్దతుల్ల గ్రామంలో రెండు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశారని, తను మొత్తం రెండు చోట్ల ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడని, చట్ట విరుద్ధంగా ఉన్న ఓట్లను తొలగించి, కౌన్సిలర్ పదవిని రద్దు చేయాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని సంతోష్ కుమార్ తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని జనసేన నాయకులు తెలిపారు.

Latest