Mahaa Daily Exclusive

  మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గా బండారి అనూష బాధ్య‌త‌లు…

Share

  • మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గా బండారి అనూష బాధ్య‌త‌లు
  • అభినందించిన అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి , కౌన్సిల‌ర్లు, కాంగ్రెస్ శ్రేణులు
  • ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి కృషి చేస్తాన‌న్న నూత‌న చైర్ ప‌ర్స‌న్

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ మున్సిప‌ల్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి త‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ బండారి అనూష స‌తీష్ అన్నారు.శ‌నివారం ఆమె ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ కార్యాల‌యం లోని త‌న ఛాంబ‌ర్ లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.శాస్త్రోక్త పూజ‌ల అనంత‌రం త‌న సీట్లో ఆసీనుల‌య్యారు. స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌ల‌తో ఆశీర్వ‌చ‌నాలు అందించారు.ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు , కౌన్సిల‌ర్లు ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌చేసారు.త‌న‌కు ప‌ద‌వి ద‌క్కేలా కృషి చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డితో పాటు ప్ర‌తీ ఒక్క‌రికి అనూష కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.49 వార్డుల‌లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌న్నారు.మున్సిప‌ల్ అభివృద్ధే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌న్నారు. నూత‌న మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ కు అన్ని విష‌యాల‌లో త‌గిన తోడ్పాటునందిస్తూ ఆదిలాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దుతామ‌ని అభివృద్ధి చేస్తామ‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ రోహిత్ , కౌన్సిల‌ర్లు, ఆత్మ చైర్మ‌న్ సంతోష్ రావు,డీసీసీబీ మాజీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి, గండ్ర‌త్ సుజాత‌, ప‌ట్ట‌ణ కాంగ్రెస్ ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.