Mahaa Daily Exclusive

  నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడ్తా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తా – కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Share

గద్వాల, మహా

జోగులాంబ గద్వాల నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి..సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు కవిత.నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని కవిత చెప్పారు. ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం ముందుకు సాగదని, వారం రోజుల్లో సీడ్ పత్తి బకాయిలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసిందని..కృష్ణా,తుంగభద్ర నదులున్నా నడిగడ్డకు నీళ్లు రావట్లేదని విమర్శించారు. అత్తా, అల్లుడు తప్ప..ఇక్కడ కొత్త లీడర్లు లేరా అని కవిత ప్రశ్నించారు . ప్రభుత్వం ఇచ్చిన రూ. 2500 హామీ ఎక్కడకు పోయిందన్నారు. రైతన్నల కోసం జాగృతి పోరాడుతుందని కవిత అన్నారు.