Mahaa Daily Exclusive

  కస్తూరిభా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ..

Share

హుజూర్ నగర్ మహా

సూర్యాపేట జిల్లా పాలకీడు కస్తూరిభా గాంధీ పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాలకీడు 8వ వార్డుమెంబర్ ఎస్ కె జానీ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు అనేవి జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మెట్టు విద్యార్థులు ధైర్యంగా,నిబద్ధతతో పరీక్షలు రాస్తే ఉన్నత ఫలితాలు సాధించగలరన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకారులుగాఎదగాలన్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్షా ప్యాడులను పెన్నులను బహుమతిగా అందజేశారు. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాదించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ సుజాత,సామజిక కార్యకర్తలు,నాగరాజు,నవీన్,చంటి, పాఠశాల సిబ్బంది తదితరులు పాలుగోన్నారు.