- కారేపల్లి ఐకేపీలో రూ.3 కోట్ల మొండిబకాయిలు
- మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ
- మహా కథనాలతో విచారణకు కదిలిన యంత్రాంగం
కారేపల్లి, మహా:కారేపల్లి మండల ఐకేపీ లో మూడు కోట్ల రూపాయలకు పైబడి మొండి బకాయిలు పేరుకుపోయాయి. మండలంలోని 60 గ్రామ సమాఖ్యల పరిధిలో స్వయం సహాయక సంఘాలకు 8 కోట్ల రూపాయల కు పైబడి వివిధ రకాల రుణాలు బ్యాంకుల నుండి ఇవ్వగా మూడు కోట్లకు పైబడి మొండి బకాయిలు ఉన్నాయి. జిల్లాలోనే అతి తక్కువ శాతం రికవరీ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఈ మండలం పై దృష్టి సారించింది. రూ. 80657671 లోన్లు ఇవ్వగా రూ.33693601 మొండి బకాయిలుగా మిగిలిపోయాయి. వీటి రికవరీ కోసం ఆర్ఆర్ యాక్టు తో ఆఫీసర్లు జప్తులకు సిద్ధమవుతు న్నారని సమాచారం.
*అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి…
మండల వ్యాప్తంగా ఉన్న మొండి బకాయిలలో కోటిన్నర దాకా కొందరు అధికారులు కొందరు గ్రామ దీపికలు కలసి కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు లోన్లు మంజూరు చేయించి వారికి నామ మామాత్రంగా కొన్ని అప్పగించి భారీగా డబ్బులు కాజేసి మేమే కట్టుకుంటామని నమ్మ బలికిన అక్రమ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమాలపై మహా వరస పరిశోధనాత్మక కథనాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని విషయాలపై వివరాలు సేకరించే పనులు చేపట్టింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు చరుచుకున్నట్లు గా అక్రమార్కులు ఉలిక్కిపడుతూ అది చేస్తాం ఇది చేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలతో ఐకెపీ లో అక్రమాలన్నీ గ్రామాల వారీగా వెలుగులోకి వస్తాయి.
*అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి….
కారేపల్లి మండల వ్యాప్తంగా ఐకేపీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన అక్రమార్కుల గుండెల్లో మహా కథనాలతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చేసిన తప్పులన్నీ బయటపడతాయనే భయంతో నానా రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో వారికున్న రాజకీయ పలుకుబడితో అక్రమాలన్నిటిని బయటికి రానివ్వకుండా తొక్కిపట్టా రు.
*మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ
ఉత్తుత్తి గ్రూపులతో మండలంలోని మోట్లగూడెం గ్రామంలో జరిగిన 12 లక్షల రూపాయల అక్రమంపై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఐకేపీ ఏపిఎం పిడమర్తి వెంకటేశ్వరావు, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సైదేశ్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ ను కలిసి వివరాలు సేకరించారు. స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో రుణాలు తీసుకున్న పత్రాల కాపీలను తీసుకునేందుకు మేనేజర్ కు లెటర్ ఇచ్చారు. మరో వైపు గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు కూడా ఈ అక్రమ రుణాలపై విచారణ చేపడుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని, విచారణ నిర్వహించి పూర్తిస్థాయి నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్లు ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.








