- కందుకూరు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
- సొంత గూటికి చేరుకున్న సత్తెన్న సహ పలువురు
- కార్యకర్తల బలంతో వచ్చే ఎన్నికల్లోనూ విజయం
- మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (మహేశ్వరం) మహా:
రాష్ట్రంలో త్వరలో వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే తిరుగులేని విజయం సాధిస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కందుకూరు సీనియర్ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ జాగృతి ఇన్ఛార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు,కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్యకర్తల బలం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పార్టీని వీడిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. అందుగుల సత్యనారాయణ సహా మహిళలు, యువకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కిచ్చెన్నగారు హామీ ఇచ్చారు. పంచాయతీలు, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నాయకులకే పట్టం కట్టాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.








