- పిల్లలకు విద్యతో పాటు ఆటలు ముఖ్యం: కేఎల్ఆర్
- సీఎం క్రీడాకప్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం
- విద్యార్థులతో మమేకమైన మాజీ లెక్చరర్ కిచ్చెన్న
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (మహేశ్వరం) మహా:
విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఆటలు ఎంతో ముఖ్యమని మాజీ లెక్చరర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడలోని కేఎల్ఆర్ వెంచర్ లో… రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసు వారైనా రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కిచ్చెన్నగారు సూచించారు. రాష్ట్ర స్థాయి అండర్ 14, 17,19 స్థాయి స్కేటింగ్ పోటీల్లో 400మంది చిన్నారులు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థిని అప్యాయంగా పలకరించి… బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిల్లలను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు సహా విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.








