- కోహెడ పండ్ల మార్కెట్ కు మంత్రివర్గం ఆమోదం
- రైతుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- గడ్డిఅన్నారం ఏఎంసీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి
- అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ఏర్పాటు
- మంత్రివర్గం ఆమోదం పట్ల హర్షం వ్యక్తం
రంగారెడ్డిజిల్లా ప్రతినిధి మహా:
కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం పొందినట్లు చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 167లో సుమారు 239 ఎకరాలలో అంతర్జాతీ పండ్ల మార్కెట్ ఏర్పాటుకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం పొందడం జరిగిందని, గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు.
మంత్రివర్గం ఆమోదం పట్ల హర్షం వ్యక్తం…
రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం, రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రైతుల పక్షాన ఉన్నట్లు, పండ్ల మార్కెట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదంతో మరోసారి రుజువైందని రైతులు, మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూత వేటు దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న, నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని, ఆదిభట్ల సర్కిల్ పరిదిలోని, కోహెడ గ్రామ రెవెన్యూలో, ప్రపంచస్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల రైతులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకు అనుగుణంగా, ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా ఉంటుందని అన్నారు. విశాలమైన రోడ్లు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో నగరం నలుమూలల నుంచి రాకపోకలకు అనువుగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఉండదని ఆయన అన్నారు.
రైతుల అభివృద్ధికి కృషి, పేరుపేరునా కృతజ్ఞతలు…
ఈ ప్రపంచ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసి, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు, రాష్ట్ర రైతులు అభివృద్ధికి పాటుపడుతూ, పండ్ల మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టివిక్రమార్కకు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఎంపీకి, రైతుల తరపున, మార్కెట్ కమిటీ పాలకవర్గం తరపున మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, ఏఎంసీ పాలకవర్గం పాల్గొన్నారు.








