హైదరాబాద్, మహా : తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జైలు సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక సాలరీ ప్యాకేజ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో ప్రముఖ జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు పాల్గొన్నాయి. జైలు సిబ్బందికి ప్రత్యేక వేతన ప్యాకేజీలను బ్యాంకులు పరిచయం చేశాయి. పెంపొందించిన బీమా రక్షణ, సమగ్ర ఆరోగ్య పరీక్షలు, ఆకర్షణీయ గృహ మరియు వ్యక్తిగత రుణ సౌకర్యాలు, తక్కువ వడ్డీ రేట్లు, ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు, ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. జైలు సిబ్బంది సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఈ సాలరీ ప్యాకేజ్ మేళాను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జైలు సిబ్బందికి దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించే ఈ మేళా విశేష స్పందన పొందే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్ళ శాఖ ఐజి ఎర్రంశెట్టి రాజేష్ మురళి బాబు హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాసరావు వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ చంచల్గూడా జైలు సూపర్నెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ చర్లపల్లి జైలు సూపర్డెంట్ ప్రమోద్ చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు పర్యవేక్షణాధికారి భరత్ తదితరులు పాల్గొన్నారు








