మెదక్, మహా : ఇల్లరికం వచ్చిన భర్త భార్యను హత్య చేసి నగలను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంట స్టేషన్ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి (35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది. త్రిమూర్తులు చేగుంటకు ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో వరలక్ష్మిని పారతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పుస్తెలతాడు, నగలు, డబ్బులు, సెల్‌ఫోన్ తీసుకొని పారిపోయాడు.
గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Post Views: 6








