
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. భోరజ్ మండలంలోని చెనాకా కోరట బ్యారేజ్ పంపు హౌస్ ను సందర్శించారు. హత్తీఘాట్ వద్ద వారికి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు ,డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6







