Mahaa Daily Exclusive

  హైడ్రాకు మరోసారి హైకోర్టు మొట్టికాయలు..

Share

  • హైడ్రాకు మరోసారి హైకోర్టు మొట్టికాయలు
  • ప్రైవేట్ భూమిలో ఫెన్సింగ్ వేసిన హైడ్రా
  • ఫెన్సింగ్ తీసేవరకు బాధితులకు రోజుకు రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశం

హైదరాబాద్, మహా : హైడ్రాకు మరోసారి రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. విధి నిర్వహణలో దూకుడుగా వ్యవహరించడమే మొట్టికాయలకు కారణమైంది. ఉప్పల్ – మల్లాపూర్‌లోని బాబానగర్ సొసైటీలో రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా కొద్ది రోజుల క్రితం కంచె వేసింది. హైడ్రా ఏక పక్ష విధానంపై ప్లాట్ల యజమానులు
హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు హైడ్రా తీరును తప్పుపట్టింది. ప్రైవేట్ ప్లాట్లలో వేసిన కంచెను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో పాటు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాను పిటిషనర్లకు చెల్లించాలని అలాగే కంచె తొలగించే వరకు పిటిషనర్లకు రోజు రూ.1 లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.