Mahaa Daily Exclusive

  కరీంనగర్ పై పమేల సత్పతి ముద్ర …రెండేళ్ళ సేవలపై ప్రజల ప్రశంసలు…..

Share

మహా, కరీంనగర్

రెండేళ్ళలో కరీంనగర్ కలెక్టర్ గా ప్రజల మనసులను పమేలా సత్పతి గెలిచారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పమేలా సత్పతిని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉదయం చేపట్టిన బదిలీల్లో కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమించింది. ఆమె దాదాపు రెండు సంవత్సరాల పైగా కరీంనగర్ జిల్లాలో నిబద్ధత క్రమశిక్షణ నీతి నిజాయితీగా అంకితభావంతో విధులు నిర్వర్తించారు. జిల్లా యంత్రం గానికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించగానే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆ తర్వాత ఎన్నికల అధికారిగా వ్యవహరించి పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. 2024 లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారు. తర్వాత 2025లో ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలను రిపోలింగ్ లేకుండా నిర్వహించి రికార్డు సృష్టించారు .

పాలనలో ప్రత్యేక మార్కు..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా 2023 అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు. ఇక్కడ పనిచేసిన రెండు సంవత్సరాల పైగా పాలన విషయంలో తనదైన ముద్ర వేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలుపుగోలుగా ఉంటూనే విధి నిర్వహణలో మాత్రం కఠినంగానే వ్యవహరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను తరచూ హెచ్చరించే వారు. ప్రభుత్వ పరంగా వచ్చే ఆదేశాలను అమలు చేయించడంలో సక్సెస్ అయ్యారు. రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా ముందుకెళ్లారు. పేదల పక్షపాతిగా పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారు నిక్కచ్చిగా వ్యవహరించారు. అధికారులతో కూడా అదే విధంగా పని చేయించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందించడంలో కీలకంగా వ్యవహరించారు. అభివృద్ధిలోనూ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను ముందు ఉంచారు. సమీక్షలు నిర్వహించడంలోనూ తనదైన శైలిని కనబర్చారు. ముఖ్యంగా విద్య వైద్య రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల సాధన అత్యుత్తమ విద్యా బోధన విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూల్లకు దీటుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ స్కూల్ లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించేలా హాజరు శాతం పెంచేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతోపాటు పేదలు అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేటు ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అన్నిరకాల వైద్య పరీక్షలు స్కానింగులు వైద్య సదుపాయం పేదలకు అందేలా ప్రత్యేకంగా కృషి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడింది. ప్రజల్లోను మంచి మార్పు వచ్చింది. దీనంతటికీ కారణం పమేలసత్పత్తి తీసుకొచ్చిన వినూత్న విప్లవాత్మక కార్యక్రమాలే నిదర్శనం. ఏ కార్యక్రమం చేపట్టినా అంకితభావము నిబద్ధత నిజాయితీగా వ్యవహరించి ప్రజల పక్షాన కలెక్టర్ నిలిచారు. పేదలకు ఎక్కడా అన్యాయం జరగకుండా పేదల పక్షపాతిగా వ్యవహరించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బూట్లు సాక్స్ లు అందజేశారు. పదో తరగతిలో ఫెలై ఏళ్ల తరబడి పని చేసుకుంటూ ఉంటున్న వారిని గుర్తించి పరీక్షలు రాయించారు. వందలాది మంది పదో తరగతిలో పాస్ అయ్యేలా ముందుండి వారిని నడిపించారు. అదేవిధంగా మరో మహత్తరమైన కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేపట్టారు. మహిళల ఆరోగ్య బాగుంటేనే సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అనే ఆలోచనతో శుక్రవారం సభ నిర్వహణకు శ్రీకరం చుట్టారు. ఇందులో మహిళలకు సంబంధించిన వైద్య పరీక్షలు వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చొరవ చూపారు. ఇది ఎంతో సక్సెస్ ఫుల్ గా ప్రస్తుతం నడుస్తోంది. అదేవిధంగా మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ప్రతి మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళా పేరిట మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో అనేక రకాలుగా వైద్య పరీక్షలు స్కానింగ్లు ఇతర ఏ రకమైన పరీక్షలైనా ఉచితంగా నిర్వహించే అవకాశం కల్పించారు. ఉచితంగా వేలాది రూపాయల విలువైన దాదాపు 50 పరీక్షల వరకు నిర్వహించే సదుపాయం కల్పించారు పమేలా సత్పతి.
ముఖ్యంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేసి పిల్లలు, గర్భిణులకు ప్రభుత్వ పరంగా అందుతున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమీక్షించారు. పాఠశాలలను తరచూ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమాన్ని తరచూ సమీక్షించి పనులను ముందుకు సాగించే ప్రయత్నం చేశారు. దీంతోపాటు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుండి నడిపించారు. స్వసక్తి సంఘాల మహిళల అభ్యున్నతికి వారు వ్యాపారంలో రాణించేందుకు ఎంతో కృషి చేశారు. వారితో అనేక యూనిట్లను ఏర్పాటు చేయించి ఇతరులకు ఆదర్శంగా తయారు చేశారు. తమ కాళ్లపై తాము సొంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దారు. మహిళల అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు అందించారు. అదేవిధంగా కరీంనగర్ లోని దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులను కలెక్టర్ పమేలా సత్పతి ఎంతో ప్రోత్సాహం అందించారు. అందత్వం అడ్డు కాదని నిరూపించేలా చేశారు. సకలాంగులకు దీటుగా వారిని తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించారు. వారి ప్రతిభను గుర్తించి పాటలు పాడడంలో శిక్షణ ఇప్పించారు. వారితో కలిసి జిల్లా కలెక్టర్ పాట పాడారు. ఈ పాట ఎంతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దివ్యాంగుల విద్యార్థులతో రెండు డాక్యుమెంటరీలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా రూపొందించారు. పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. వారికి అవసరమైన పరికరాలు అందజేశారు ముఖ్యమంత్రి. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతి పాలనలో తనదైన మార్కును చూపించారు జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. జిల్లా ప్రజల మనసు దోచుకున్న కలెక్టర్ గా రికార్డు సొంతం చేసుకున్నారు. పమేలా సత్పతి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన విన్నూతన విప్లవాత్మక కార్యక్రమాలు ఎప్పటికీ జిల్లా ప్రజలు మాత్రం మర్చిపోలేరు. ఆమె విధుల పట్ల అంకితభావం క్రమశిక్షణ నిబద్ధత క్రమశిక్షణ ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించేలా చేస్తాయని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లోనూ మరింత ఉన్నత స్థానం అధిరోహించాలని కోరుకుంటున్నారు.

కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా నియామకం:

ప్రస్తుతం ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిత్రా మిశ్రా కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం జరిగిన బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్గా నియమించింది.

చిత్రా మిశ్రా ఐఏఎస్
2019 బ్యాచ్ తెలంగాణ కేడర్ చెందిన అధికారి. 2020- 21 నాగర్‌కర్నూల్‌లో శిక్షణ పొందారు. సెప్టెంబర్ 2021- జూలై 2023 – మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ (ఎఫ్ఎసి)గా పని చేశారు జూన్ 2021 – ఫిబ్రవరి 2024 వరకు నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పని చేశారు. ఫిబ్రవరి 2024 – ఫిబ్రవరి 2026 వరకు ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా పనిచేశారు. చిత్ర మిశ్రా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందినవారు.