Mahaa Daily Exclusive

  ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు…

Share

  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో
  • ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు
  • మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

మహా, వరంగల్ బ్యూరో

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిపాలనలో సరికొత్త మార్పులకు సర్కారు దిశానిర్దేశం చేసింది. ఒకేసారి ఐదుగురు ఐఎఎస్ లకు, మూడు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగించింది. హన్మకొండ కలెక్టర్ స్పేహశబరీష్ ను మానుకోట బదిలీచేయగా, గత కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మానుకోట కలెక్టర్ బదిలీపై స్థానికులు బాణాసంచా కాల్చి సంతోషం చాటారు. ఇక వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కు హన్మకొండ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించి డబుల్ బాధ్యతలతో ఆమె పనితీరుపై విశ్వాసం ప్రదర్శించింది. జనగామ కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను నియమించగా, అక్కడి కలెక్టర్ ను గద్వాల బదిలీచేశారు. భారీ బదిలీలతో పాలనలో నవశకం కనపడనుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద తన పనితీరుతో ప్రశంసలందుకుంటున్నారు.

కొత్త నియామకాలు-బదిలీల పట్టిక:

స్నేహ శబరీష్ – హన్మకొండ కలెక్టర్ – మహబూబాబాద్ కలెక్టర్

చాహత్ బాజ్ పాయ్ – హనుమకొండ కలెక్టర్ (గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)

సందీప్ కుమార్ ఝా – జనగామ కలెక్టర్

చిత్ర మిశ్రా – ఏటూరునాగారం ఐటీడీఏ పీవో – కరీంనగర్ కలెక్టర్

వైవీ గణేష్ – వరంగల్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్