Mahaa Daily Exclusive

  ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌…

Share

  • ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • బాధ్యతను పెంచడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ, మహా : బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. నిర్దేశిత ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు లైసెన్స్‌ను రద్దు చేయడమూ ఈ విధానంలో భాగం. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ ఫోన్‌ వాడటం, అధిక వేగం, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి డ్రైవింగ్‌, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం తదితర కారణాల వల్ల ఏటా దేశంలో 1.8 లక్షల మంది మరణిస్తున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. చాలామందికి చట్టమంటే భయం, గౌరవం లేకుండా పోయిందని, అందుకే తాము గ్రేడ్‌ల వారీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ల విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.