Mahaa Daily Exclusive

  మదీనా బాధితులకు సీఎం రేవంత్ అండ…

Share

  • మదీనా బాధితులకు సీఎం రేవంత్ అండ
  • 44కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం

హైదరాబాద్, మహా : గతేడాది నవంబర్ 17న సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాదీయులు సజీవ దహనం కాగా, మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరిహారం చెక్‌లను అందించారు. మృతుల కుటుంబసభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. అలాగే గాయపడినవారికి 3 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్రంతో మాట్లాడా. మంత్రి అజారుద్దీన్‌ను మదీనా పంపించా. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు. కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం. అందుకే కుటుంబాలను సెక్రటేరియట్‌కు పిలిచి పరిహారం అందించాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఫహీంఖురేషీ పాల్గొన్నారు.
……..