Mahaa Daily Exclusive

  ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ సస్పెన్షన్‌?

Share

హైదరాబాద్‌, మహా : తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.