Mahaa Daily Exclusive

  ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు : నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

Share

మహా
….

“రానున్న రోజుల్లో మేము ఇరాన్​లోని ఉగ్రవాద పాలకులకు చెందిన వేలాది లక్ష్యాలపై విరుచుకుపడతాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమను తాము, ఈ క్రూరమైన నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన పరిస్థితులను మేము సృష్టిస్తాం. అందుకే నేను మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరాన్ పౌరులారా ఈ గొప్ప అవకాశాన్ని చేజారనివ్వకండి. ఇలాంటి అవకాశం తరానికి ఒక్కసారే వస్తుంది.”
– నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

అమెరికా స్థావరాలపై ఇరాన్​ కౌంటర్​ ఎటాక్​
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఆదేశం ప్రతీకార దాడులకు దిగింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇజ్రాయెల్​లోని టెల్​ నోప్​ ఎయిర్​వేస్​, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యాలతోపాటు రక్షణ రంగ ఫ్యాక్టరీలు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్​పీ షిప్​పై ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్​’లో భాగంగా, 4 డ్రోన్లతో దాడి చేసినట్లు టెహ్రాన్​ వెల్లడించింది.