Mahaa Daily Exclusive

  బంకర్లలో తలదాచుకున్న తెలంగాణ వాసులు..

Share

  • బంకర్లలో తలదాచుకున్న తెలంగాణ వాసులు
  • ఇజ్రాయెల్ లో దూసుకొస్తున్న మిస్పైళ్ళు
  • బంధువులకు ఫోన్ల ద్వారా సమాచారం

హైదరాబాద్, మహా : మిస్సైళ్లు, డ్రోన్లతో మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా.. ఈ రెండు దేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుడోంది. దీంతో ఆ దేశాలకు వలస వెళ్లిన ప్రజలు క్షణం క్షణం భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన పలువురు ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. టెల్‌ అవీవ్‌లో ఆర్మూర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ భయంతో బంకర్లలో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు వీడియోల ద్వారా బాధితులు తెలియజేశారు. వారు తలదాచుకున్న చోటుకి ఇప్పటివరకు ఎనిమిది మిస్సైళ్లు దూసుకొచ్చాయని వీడియోల ద్వారా చెప్పుకొచ్చారు.