హైదరాబాద్, మహా : టోలీచౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారు. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక భవనం కూలిన ఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కొత్త భవనానికి గోవా కర్రలు కట్టి.. వాటిపై నిలబడి కార్మికులు పనులు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఆ కట్టెలు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుపతి రావు, అది నారాయణగా గుర్తించారు. గాయపడిన వారు శ్రీకాకుళానికి చెందిన ఆర్.రమేష్, ఒడిశాకు చెందిన ఏం.రమేష్, బండ్లగుడాకు చెందిన లాల్ అహ్మద్‌గా గుర్తించారు. గాయపడ్డ వారిని లంగర్ హౌస్‌లోని ఆలివ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
భవనం పక్కనే ఆటోలో ఉన్న వారిపై గొవా కర్రలు పడటంతో అందులో ఉన్నవారు కూడా గాయపడ్డట్లు సమాచారం. భవన నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలపై నిలబడి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కర్రలు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు యజమానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.








