- ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యే రంగారెడ్డి
- ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది
- సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- పోచారం గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రెడ్డి, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీది దీపాలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, 99 రోజులపాటు నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేకూరేలా అధికారులు కృషి చేయాలని, ఇప్పటికే పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇల్లు అందించడం జరిగిందని, అలాగే రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏఎంసి చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి, ఏసిపి రాజు, గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఎంపీడీవో బాల శంకర్ ఎంపిఓ పలు శాఖల అధికారులు, గ్రామ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








