Mahaa Daily Exclusive

  భూమా దేవి’ నా హృదయానికి దగ్గరైన పాత్ర : రష్మిక

Share

హైదరాబాద్, మహా

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025’లో ఉత్తమ నటిగా ఎంపికైన రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కృతజ్ఞురాలిని. ఈ సినిమాలో నేను పోషించిన ‘భూమా దేవి’ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రష్మిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు ఎంతో విలువైనదని ఆమె వ్యాఖ్యానించారు.

Latest