Mahaa Daily Exclusive

  గల్ఫ్ దేశాలపై ఇరాన్ దొంగదెబ్బ..

Share

  • గల్ఫ్ దేశాలపై ఇరాన్ దొంగదెబ్బ
  • రాత్రంతా మిస్పైళ్ళు.. డ్రోన్ల వర్షం
  • మిస్పైళ్ళు.. డ్రోన్లతో గజగజలాడుతున్న దుబాయ్
  • 16 బాలిస్టిక్ మిస్సైళ్లు, 117 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది: యూఏఈ

మహా
గల్ఫ్ దేశాలను ఇరాన్ గజగజలాడిస్తోంది. ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 117కి పైగా డ్రోన్లతో తమపై దాడి చేసిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ ఆదివారం తెలిపింది. అయితే తమ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 16 క్షిపణులను అడ్డుకుందని, కాగా ఓ క్షిపణి సముద్రంలో పడిందని యూఏఈ పేర్కొంది. మెజారిటీ డ్రోన్లను తాము కూల్చివేశామని, కాకపోతే 4 డ్రోన్లు మాత్రం తమ భూభాగంలో పడ్డాయని వెల్లడించింది. ఇటువంటి ముప్పులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా దుబాయ్ పై ఇలా బాంబుల వర్షం కురుస్తుండడంతో అక్కడ స్థిరపడ్డ ధనవంతులైన భారతీయులు స్వదేశమే బెటరని తిరిగొచ్చేస్తున్నారు. ఆదివారం వరకు 52వేల మంది ఇలా తిరిగొచ్చేశాకని చెబుతున్నారు. ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయెల్‌‌ దాడులు.. ఇరాన్‌‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌ ఖమేనీ హత్యతో మొదలైన యుద్ధం మరింత ఉధృతంగా మారింది. తమ పొరుగుదేశాలపై దాడులు ఆపేస్తామని ప్రకటించిన ఇరాన్‌ మాట తప్పింది. గల్ఫ్ దేశాలను ఇరాన్‌ ఊచకోత కోస్తుంది. ఇరాన్ రాత్రంతా గల్ఫ్‌ దేశాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దుబాయ్‌లోని మెరినా టవర్‌పై ఇరాన్‌ దాడి చేసింది. ఈ దాడిలో మెరినా టవర్‌లోని ఓ ఎత్తైన బిల్డింగ్‌ను మిస్సైల్స్ శకలాలు తాకాయి. దీంతో బిల్డింగ్‌లో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు.
…..

Latest