- 10వ తరగతి పాస్ అయితే
.. నెలకు రూ.1,500 - బెంగాల్ యువతకు దీదీ ఆఫర్
మహా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ‘యువశక్తి’ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. టెన్త్ పాసైన యువతకు ఈ పథకం కింద అర్హులైన యువతీ యువకులకు నెలకు రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న యువతకు ఈ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనం చేకూర్చనుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం భావిస్తోంది.
..
Post Views: 9







