హైదరాబాద్, మహా
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ విజయం సాధించింది. దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడిగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్ గా సాయి రాజేష్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. వీఎన్ ఆదిత్య 641 ఓట్లతో విజయం సాధించగా.. తన సమీప ప్రత్యర్థి మద్దినేని రమేష్ కు 400 ఓట్లు వచ్చాయి. ట్రెజరర్ గా పోటీ చేసిన దర్శకుడు సాయి రాజేష్ 938 ఓట్లతో గెలిచారు. వి. సముద్ర 703 ఓట్లు గెలుచుకుని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వీఎన్ ఆదిత్య & సాయి రాజేష్ ప్యానెల్ నుంచి 18 మంది పోటీ చేస్తే 16 మంది గెలిచారు. శైలేష్ కొలను, సాగర్ చంద్ర, కొండా విజయ్ కుమార్, శ్రీరామ్ ఆదిత్యతో సహా తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలుస్తోంది.







