మహా ప్రత్యేకం
సంజూ శాంసన్ ను ఫ్యాన్స్ ఆకాశానికెత్తుతున్నారు. టీమిండియాలో ఆయా షేర్ అంటూ మీమ్స్, సాంగ్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. మ్యాచ్‌తో శాంసన్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగుల బాదిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఎడిషన్‌లో శాంసన్ 5 మ్యాచ్‌ల్లోనే 80.25 యావరేజ్‌తో 321 రన్స్ చేశాడు. దీంతో విరాట్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. 2014లో విరాట్ 319 పరుగులు చేశాడు. 12ఏళ్లుగా ఈ రికార్డ్ ఇలాగే కొనసాగింది. ఇప్పుడు దీన్ని శాంసన్ బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో శాంసన్ ఇప్పటిదాకా 24 సిక్స్‌లు బాదాడు,. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా రికార్డు కొట్టాడు. ఈ సీజన్లోనే కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ (20 సిక్స్‌లు) ను అధిగమించాడు
ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేసిన శాంసన్, టీ20 ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ కొట్టాడు. ఈ క్రమంలో విండీస్ మాజీ క్రికెటర్ శామ్యూల్స్ (85 పరుగులు) రికార్డ్‌ను బ్రేక్ చేశాడు
టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌తోపాటు ఫైనల్లోను 50+ స్కోర్ బాదిన క్రికెటర్లు
2009- షాహిద్ అఫ్రిది- పాకిస్థాన్
2014- విరాట్ కోహ్లీ- భారత్
2026- సంజు శాంసన్- భారత్
T20 వరల్డ్‌కప్‌లో వరుసగా అత్యధిక 50+ స్కోర్లు
3 – మహేల జయవర్ధనే (2010)
3 – విరాట్ కోహ్లీ (2016, 2021)
3 – బాబర్ ఆజామ్ (2021)
3 – కేఎల్ రాహుల్ (2021)
3 – కుశాల్ మెండిస్ (2026)
3 – సాహిబ్జాదా ఫర్హాన్ (2026)
3 – సంజు శాంసన్ (2026)







